Asianet News TeluguAsianet News Telugu

రేఖానాయక్ నామినేషన్‌లో తప్పులు: కలెక్టర్ నిర్ణయమే కీలకం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామినేషన్‌ పై గందరగోళం నెలకొంది.

telangana assembly elections: mistakes in Rekha naik's nominations
Author
Khanapur, First Published Nov 20, 2018, 3:07 PM IST


ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామినేషన్‌ పై గందరగోళం నెలకొంది.ఖానాపూర్  అసెంబ్లీ స్థానం నుండి  గత ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన  రేఖానాయక్ విజయం సాధించారు. కేసీఆర్ ఈ దఫా కూడ  ఆమెకే టికెట్టు కేటాయించారు.

ఖానాపూర్  టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖా నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్‌లో తప్పులు ఉన్నట్టుగా రిటర్నింగ్ అధికారులు గుర్తించారు.  రేఖానాయక్ దాఖలు చేసిన మూడు సెట్లలోనూ ఓ కాలమ్ ఖాళీగా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.  ఈ విషయమై ఏం చేయాలనే దానిపై జిల్లా కలెక్టర్‌కు సమాచారాన్ని ఇచ్చారు  రిటర్నింగ్ అధికారి.  

జిల్లా కలెక్టర్ నిర్ణయం కోసం  రిటర్నింగ్ అధికారి ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే  రేఖా నాయక్ నామినేషన్ ను తిరస్కరించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios