Telangana Assembly Elections: నాలుగో జాబితాపై బీజేపీ కసరత్తు .. నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి

Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మూడు జాబితాలను బీజేపీ నాయకత్వం విడుదల చేసింది. తాజాగా నాలుగో జాబితాపై అధిష్టానం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి పయనం కానున్నారు. 

Telangana Assembly elections  bjp exercise on the fourth list Kishan Reddy will move to Delhi KRJ

Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్.. అన్ని స్థానాల్లో అభ్యర్థులకు ప్రకటించి..ప్రచారంలో దూసుకెళ్తుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ప్రధాన నాయకులంతా ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు అంటూ.. బిజీబిజీగా మారారు. ఇలా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ లు నింపాదిగా అభ్యర్థులకు ప్రకటించుకుంటూ.. ప్రచారం సాగిస్తున్నాయి. ఈ జాతీయ పార్టీలు తమ అగ్రనేతలను రంగంలోకి దించి.. ప్రచారం సాగిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి.. అధికారం హస్త గతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  

ఇప్పటివరకు బీజేపీ మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాల్లో 88 మంది అభ్యర్థులను సీట్లు కేటాయింది. ఇక మిగిలిన 31 సీట్లకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడం. ఈ నామినేషన్ల గడువు 10వ తేదీ వరకు పూర్తి కానునడంతో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకుని వారికి సీట్లు కేటాయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు వచ్చాయి. అలాగే.. జనసేన  అభ్యర్థులకు కూడా టిక్కెట్లు కేటాయించే అవకావం ఉందా అనే అంశంపై మల్లగుల్లాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ప్రకటించే నాలుగవ జాబితాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.  

ఆయనతో పాటు బండి సంజయ్,ఈటల రాజేందర్, డీకే అరుణ తదితర నేతలు కూడా ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ జాబితాలో ప్రధానంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తో పొత్తు.. ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్లపై క్లారిటీ, అసంతృప్తి నేతల గురించి కూడా అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా జనసేనకు 8 నుంచి 10 స్థానాలను సీట్లు కేటాయించబోతున్నారనే ఊహాగాహాలు వెలువడుతున్నాయి. ఈ జాబితాపై రెండు, మూడు రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios