Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఏక‌ప‌క్ష‌మే.. ముచ్చ‌ట‌గా మూడో సారి సీఎంగా కేసీఆర్.. : మంత్రి కేటీఆర్

BRS: తెలంగాణలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమే అనీ, భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) భారీ విజయం ఖాయమ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. రెండుసార్లు ప్రజలు నిండు మనసుతో ప్రజా ఆశీర్వాదం అందించారని మూడోసారి కూడా ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించిన సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
 

Telangana assembly elections are one-sided. KCR to be CM for third time: KTR  RMA
Author
First Published Oct 9, 2023, 5:30 PM IST | Last Updated Oct 9, 2023, 5:30 PM IST

Telangana IT minister KTR: ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మూడవసారి ముమ్మాటికి అధికారంలోకి వచ్చేది భారత రాష్ట్ర సమితినే (బీఆర్ఎస్)అనీ, దక్షిణ భారతదేశంలో తొలిసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమే అనీ, భారత రాష్ట్ర సమితికి భారీ విజయం ఖాయం అన్నారు. రెండుసార్లు ప్రజలు నిండు మనసుతో ప్రజా ఆశీర్వాదం అందించారని మూడోసారి కూడా ప్రజలు భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. డిసెంబర్ 3న వచ్చే ఎన్నికల ఫలితాల ద్వారా సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందించిన సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పదేళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలకు అందించిన అభివృద్ధిని పాశుపతాస్త్రంగా మార్చుకొని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన త‌మ విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయ మంత్రంగా మారుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరొకసారి ఓటమి తప్పదనీ, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామన్నారు. నిరంతరం ప్రజలకు మంచి చేసిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేస్తారనీ, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల పై వేటు వేస్తారన్నారు. 

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో త‌మ పార్టీ అభ్యర్థులు ఉన్నారనీ, బీఆర్ఎస్ పార్టీ కెప్టెన్, సీఎం అభ్యర్థి కేసీఆర్ అని పేర్కొన్న కేటీఆర్.. ప్రతిపక్షాలకు ముఖ్య మంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప గాడ్సే సిద్ధాంతాలు నడవవని కాషాయ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి శ్రేణులు సమరోత్సహంతో కదం తొక్కుతున్నాయని ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఎగరవేయాలన్న బలమైన కోరిక కనిపిస్తున్న‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నిబద్ధతతో చేసిన పోరాటాన్ని ప్రజలు గుర్తించి 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిపించారనీ, ఆ తర్వాత సబ్బండ వర్గాలకు అందించిన సంక్షేమ కార్యక్రమాల వలన 2018లో మరోసారి ప్రజలు భారత రాష్ట్ర సమితిని దీవించారన్నారు.

ఈసారి జరిగిన పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలు గుర్తించి మరోసారి పట్టం కడతారన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉన్నదనీ,  యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం చేసిందనీ,  పోటీకి ముందే బీజేపీ కాడి ఎత్తేసింది అని విమ‌ర్శించారు. తెలంగాణ చరిత్ర బీఆర్ఎస్ తోనే అన్న కేటీఆర్.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కూడా కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. ఈసారి 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డులను బీఆర్ఎస్ పార్టీ తిరగరాస్తుందనీ, పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios