బిఆర్ఎస్ కు షాక్... వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రాజీనామా
తెెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిఆర్ఎస్ కు వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల షాకిచ్చారు. భర్తతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ప్రతిపక్ష బిజెపి,కాంగ్రెస్ పార్టీలే కాదు అధికార బిఆర్ఎస్ సైతం నాయకుల జంపింగ్ లతో తలపట్టుకుంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం పార్టీలు మారుతుండటంతో వారిని సెకండ్ క్యాడర్ లీడర్లు కూడా ఫాలో అవుతున్నారు. ఇలా పార్టీపై అసంతృప్తితో కొందరు... అంతర్గత విబేధాలతో మరికొందరు... ఇతరపార్టీల్లో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్మి ఇంకొందరు... కారణమేదైనా ఇలా పార్టీ మారాలనుకుంటున్న నాయకులకు అసెంబ్లీ ఎన్నికలే సరైన సమయంగా భావిస్తున్నారు. ఇంతకాలం కొనసాగిన పార్టీకి షాకిస్తూ ఇతరపార్టీల్లో చేరుతున్నారు.ఇలా వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల, భర్త రమేష్ కుమార్ బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు.
వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 24వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ నాయకురాలు మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భార్యను గెలిపించుకోవడంలో బిఆర్ఎస్ నేత రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. రాజకీయ పలుకుబడి కలిగిన రమేష్ మున్సిపల్ ఛైర్మన్ పదవి మహిళలకు రిజర్వ్ కావడంతో అది తనభార్యకు దక్కేలా చేసుకున్నాడు. ఇలా వికారాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా మంజుల నియమితులయ్యారు.
అయితే వికారాబాద్ లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మంజుల, రమేష్ దంపతులు, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు మద్య రాజకీయ వైరం పెరిగింది. తన వర్గం కౌన్సిలర్లతో సొంత పార్టీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆందోళనలు చేయించడం... ఇది మరింది ముదిరి అవిశ్వాసం పెట్టించే స్థాయికి చేరింది. అంతేకాదు తమపై ఎమ్మెల్యే కేసులు పెట్టించడం... అభివృద్ది పనులకు ఆమోదం తెలపకపోవడం... నిధులు కేటాయించపోవడం చేస్తుండటంతో విసిగిపోయామని మంజుల, రమేష్ దంపతులు వాపోతున్నారు.
Read More Telangana Assembly Elections 2023 : స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్... కేటీఆర్, హరీష్ లకు కీలక టాస్క్
ఎమ్మెల్యే ఆనంద్ తీరుపై పార్టీ పెద్దలకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని మున్సిపల్ ఛైర్మన్ దంపతులు ఆరోపించారు. ఇక అవమానాలు భరిస్తూ పార్టీలో కొనసాగడం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నామని తెలిపారు. ఏపార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ దంపతులు మంజుల, రమేష్ ప్రకటించారు.