Telangana Assembly Elections 2023 : స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్... కేటీఆర్, హరీష్ లకు కీలక టాస్క్
తెలంగాణ అసెెంబ్లీ ఎన్నికల వేళ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రాజకీయ అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన బాటలోనే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నడుస్తూ బిఆర్ఎస్ హ్యాట్రికి విజయం కోసం పావులు కదుపుతున్నారు.
kcr
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంకోసం అధికార బిఆర్ఎస్ పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించముందే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తులను బుజ్జగించడంలోనూ బిఆర్ఎస్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇలా ఎన్నికల షెడ్యూల్ నాటికి అంతా సెట్ చేసుకున్న కేసిఆర్ ఇప్పుడు ఇతర పార్టీలను దెబ్బతీసే పనిలో పడ్డారు. ఇతర పార్టీల అభ్యర్థుల లిస్ట్ వెలువడిన వెంటనే మంత్రులు కేటీఆర్, హరీష్ రావును అధినేత అలర్ట్ చేస్తున్నారు. టికెట్ దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను బిఆర్ఎస్ వైపు తిప్పుకునే బాధ్యతను కేటీఆర్, హరీష్ లకు అప్పగించారు కేసీఆర్.
KCR, KTR, BRS, Telangana
అధినేత కేసీఆర్ తమకు అప్పగించిన టాస్క్ ను మంత్రులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న ఇతర పార్టీల నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్లి కలుస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్. వారి రాజకీయ భవిష్యత్ పై హామీ ఇస్తూ బిఆర్ఎస్ లో చేరేలా ఒప్పిస్తున్నారు. సీనియర్ నాయకులెవరైనా వుంటే కేసీఆర్ ను కలిపించి ఆయనచేత హామీ ఇప్పిస్తున్నారు బావబామ్మరిది.
KTR Harish
ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటించింది... ఇతర పార్టీల నుండి ఎవరు చేరినా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ ఇతర పార్టీల్లోని అసంతృప్తులను బిఆర్ఎస్ లో చేరేలా ఒప్పిస్తున్నారంటే కేటీఆర్, హరీష్ రాజకీయ చాణుక్యులే అని చెప్పాలి. ఇలా కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి పెద్ద నాయకులనే కాదు సెకండ్, థర్డ్ స్థాయి నాయకులతోనే మంత్రులిద్దరు స్వయంగా భేటీ అవుతున్నారు... వారి చేరిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. దీంతో బిఆర్ఎస్ కొత్త లీడర్లు, క్యాడర్ తో మరింత బలంగా మారుతోంది.
KTR Harish
ఇలా ఇప్పటికే మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి వంటి సీనియర్ ను బిఆర్ఎస్ లో చేరేందుకు ఒప్పించారు కేటీఆర్, హరీష్. నాగర్ కర్నూల్ అసెంబ్లీ సీటును ఇప్పటికే వేరేవారికి కేటాయించింది బిఆర్ఎస్... అయినా ఆ సీటు దక్కకపోవడం వల్లే కాంగ్రెస్ ను వీడిన నాగంను తమవైపు తిప్పుకున్నారు. ఇలా కేసీఆర్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా సరికొత్త ఎత్తుగడలతో రాజకీయాలు చేస్తున్నారు కేటీఆర్, హరీష్.
PVR
ఇక హైదరాబాద్ లో మరో కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా బిఆర్ఎస్ లో చేరడానికి సిద్దమయ్యారు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన అతడికి కాంగ్రెస్ మొండిచేయి ఇవ్వడంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. విష్ణువర్ధన్ తో చర్చలు జరిపిన కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ ఏర్పాటుచేసారు. భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తానని... ఇప్పటికయితే బిఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలని విష్ణువర్దన్ కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో బేషరతుగా బిఆర్ఎస్ లో చేరేందుకు పిజెఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి సిద్దమయ్యారు.
Daruvu Ellanna
ఇదిలావుంటే తెలంగాణ ఉద్యమ నాయకుడు, ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న దరువు ఎల్లన్న కూడా కారెక్కడానికి సిద్దమయ్యారు. బిజెపిపై తీవ్ర అసంతృప్తితో వున్న అతడు ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.