కాంగ్రెస్ కు అసమ్మతి సెగ.. రేవంత్ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీని ఆశ్రయించిన అసంతృప్త నేతలు
Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, పలువురు సీనియర్ నేతలను కాదనీ, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. దూకుడు మీదున్న కాంగ్రెస్ అసమ్మతి సెగ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం ఎన్నికల వేళ రేవంత్ పై మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తూ ఈడీని ఆశ్రయించడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, పలువురు సీనియర్ నేతలను కాదనీ, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి. దూకుడు మీదున్న కాంగ్రెస్ అసమ్మతి సెగ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సైతం ఎన్నికల వేళ రేవంత్ పై మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తూ ఈడీని ఆశ్రయించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, అసంతృప్త కాంగ్రెస్ నేతలు కలకలం రేపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కకపోవడంతో పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు పలువురు ఇటీవల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆశ్రయించి రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ ఆరోపణలపై ఫిర్యాదు చేశారు. "టికెట్లు అమ్మేశారు. ఇది ఎక్కువ కాలం కొనసాగదు" అని కుర్వా విజయకుమార్, మరో కాంగ్రెస్ నేత కలీం బాబా ఈడీకి వినతిపత్రం సమర్పించారు. రేవంత్ రెడ్డిపైనే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేలపై కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్టు సాక్షిపోస్టు తన కథనంలో నివేదించింది.
మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో కాంగ్రెస్ పై విరుచుకుపడే అవకాశాన్ని వదులుకోలేదు. 'తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం.. టీపీసీసీ పదవిని ఒకరు రూ.50 కోట్లకు అమ్మేస్తే, మరొకరు రూ.50 కోట్లకు కొనుగోలు చేశారని, అవినీతి కుంభకోణాలపై రాహుల్ గాంధీ ప్రపంచానికి ఉపన్యాసం ఇస్తున్నారన్నారని పేర్కొంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. మరోక పోస్టులో ఓటుకు నోటు కేసులో ఇప్పటికే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన టీపీసీసీ అధ్యక్షుడి 'నోట్ ఫర్ సీట్' కుంభకోణంపై విచారణ జరిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)కు ఫిర్యాదు చేసిన విషయాలను ప్రస్తావించారు.