Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ సమస్యను బీఆర్‌ఎస్‌ మాత్రమే పరిష్కరించింది.. : సీఎం కేసీఆర్

Praja Ashirvada Sabha-KCR: ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయ‌నీ, నీటిపారుద‌ల ప్రాజెక్టుల క్రెడిట్ల కోసం పోరాడుతున్నాయని ఆరోపించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రభుత్వంపై 125 కేసులు పెట్టారని అన్నారు. 'మీరు 24 ఏళ్లుగా నన్ను గమనిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడాను. అప్పుడు ఎవరూ రాలేదు. ఇప్పుడు వాళ్లు వచ్చి మీ దగ్గర ఏమైనా ఉందా?అని అడుగుతున్నారు' అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుల తీరుపై మండిప‌డ్డారు.
 

Telangana Assembly Elections 2023: Only BRS has solved the fluoride problem in the state, CM KCR RMA
Author
First Published Oct 27, 2023, 1:49 PM IST

Telangana Assembly Elections 2023: రాష్ట్రంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌ని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర) అన్నారు. అయితే,  ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయ‌నీ, నీటిపారుద‌ల ప్రాజెక్టుల క్రెడిట్ల కోసం పోరాడుతున్నాయని ఆరోపించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రభుత్వంపై 125 కేసులు పెట్టారని అన్నారు. 'మీరు 24 ఏళ్లుగా నన్ను గమనిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడాను. అప్పుడు ఎవరూ రాలేదు. ఇప్పుడు వాళ్లు వచ్చి మీ దగ్గర ఏమైనా ఉందా?అని అడుగుతున్నారు' అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుల తీరుపై మండిప‌డ్డారు.

గ‌త ప్ర‌భుత్వాల పాల‌న తీరును ప్ర‌స్తావిస్తూ.. కాంగ్రెస్, టీడీపీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇంటింటికి తమ ప్ర‌భుత్వం తాగునీరు అందిస్తోంద‌ని తెలిపారు. మునుగోడులో బీఆర్‌ఎస్ ఫ్లోరోసిస్‌ను నిర్మూలించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయ‌కులు 55 ఏళ్ల హయాంలో ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. 2003-04 సంవత్సరంలో బాధితులను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వద్దకు తీసుకెళ్లార‌నీ, అయిన‌ప్ప‌టికీ వారికి ఏమీ చేయలేకపోయారు.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు. కానీ తాము వ‌చ్చాక దీనికి చెక్ పెట్టామ‌ని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో తాగునీటిలో ఫ్లోరైడ్‌ సమస్యను కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమే పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు.

అలాగే, వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రిగా పనిచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి త‌న వెంటే ఉన్నారని చెప్పిన కేసీఆర్..  "ఆయ‌న ఎప్పుడూ వనపర్తి ప్రజల గురించి చింతిస్తూ ఉంటాడు. మారుమూల గ్రామాలు, అనేక చిన్న తండాలలో లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత గురించి ఆయన నాకు చెబుతూనే ఉన్నారని" అన్నారు. ప్రాజెక్టుల ఆమోదం కోసం నిరంజన్‌రెడ్డి 100 సార్లు ఫోన్‌ చేశారనీ, లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి విజయవంతమైన నీటిపారుదల అందించడం వెనుక ఆయన ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios