Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Elections 2023: ఐదు కంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నాయకులు ఎవ‌రంటే..?

Telangana Elections 2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువ‌సార్లు ఎన్నికైనా నాయ‌కులు ప్ర‌స్తుత ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న‌వారు చాలా మందే ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సీటు సాధించిన బలమైన నాయకుల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 
 

Telangana Assembly Elections 2023: Leaders who have been elected to the Assembly more than five times RMA
Author
First Published Oct 29, 2023, 6:15 AM IST

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అయితే, అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువ‌సార్లు ఎన్నికైనా నాయ‌కులు ప్ర‌స్తుత ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న‌వారు చాలా మందే ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సీటు సాధించిన బలమైన నాయకుల వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 

రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ కొన‌సాగుతోంది. అయితే, తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతల వివ‌రాలు గ‌మ‌నిస్తే ఈ ఘనత సాధించిన నాయ‌కులు 45 మందికి పైగా ఉన్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018). అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి, బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ ఇద్దరూ ఏడుసార్లు ఎన్నిక‌య్యారు. 1983, 1985లో టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందడం, ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై జానారెడ్డి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.  ఈట‌ల రాజేంద‌ర్ 2004, 2008, 2009 (బైపోల్), 2010 (బైపోల్), 2014, 2018 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన త‌ర్వాత 2021లో మ‌రోసారి ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.

అలాగే, జీ.గడ్డెన్న‌, టీ.జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సీ.రాజేశ్వర్ రావు, త‌న్నీరు హరీశ్ రావు, డాక్టర్ ఎం.చెన్నారెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవరెడ్డి సహా పలువురు నేతలు ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన వారిలో జె.రాజారాం, గంప గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసీ, సలావుద్దీన్ ఒవైసీ, అమానుల్లాఖాన్, జి.సాయన్న, డాక్టర్ పి.శంకర్ రావు, గురునాథరెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి.గోవర్ధన్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీలు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios