తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2023: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు ..

KTR: డిసెంబ‌ర్ 3వ తేదీ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. భగవంతుడు మనిషిని సృష్టిస్తే.. మనిషి కులాన్ని సృష్టించాడని తెలిపారు. అయితే, ప్రతి మనిషికి సమానమైన తెలివితేటలు ఉంటాయని తాను బలంగా నమ్ముతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
 

Telangana Assembly Elections 2023: KTRs convoy inspected amidst Model Code of Conduct RMA

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ధ‌న ప్రవాహం భారీగా జ‌రుగుతున్న‌ద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు ప‌ట్టుబ‌డ్డాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో మ‌రింత‌గా న‌జ‌ర్ పెంచిన ఎన్నిక‌ల సంఘం.. ముమ్మ‌రంగా వాహ‌నాల‌ను త‌నికీ చేస్తోంది. ఈ క్ర‌మంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకుని త‌నిఖీ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద బుధవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కాన్వాయ్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశానికి హాజరయ్యేందుకు కేటీఆర్‌ కామారెడ్డి వెళ్తుండగా పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసు సిబ్బందికి కేటీఆర్ సహకరించి తనిఖీలకు అనుమతించారు. అనంతరం తనిఖీల త‌ర్వాత ఎలాంటి  అభ్యంతరాలు వేవ‌నీ పేర్కొంటూ పోలీసులు వాహనాలను ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. నవంబర్ 3న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

ఇదిలావుండ‌గా, వచ్చే ఎన్నికలు ఢిల్లీ పాలకులకు, తెలంగాణ ప్రజలకు మధ్య పోరుగా కేటీఆర్ అభివ‌ర్ణించారు. కామారెడ్డి లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పోరాడేందుకు కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్, రాహుల్ గాంధీలను తీసుకువస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మందికి పైగా సీఎంలను తీసుకొచ్చింద‌ని అన్నారు. అందుకే ఇది ఢిల్లీ పాలకులకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా చెబుతున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, ఆందోళ‌నలు, పోరాటాలు ప్రజలకు కొత్త కాదని అన్నారు. తెలంగాణ ప్రజలు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీలతో పోరాడారని, ఇప్పుడు మోడీతో పోరాడుతున్నారని ఆయన అన్నారు. ''రాహుల్ ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొనని నాయకుడు, ప్రజల ప్రయోజనాల కోసం పోరాడి జైలుకు వెళ్లలేదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఢిల్లీ పాలకులను ఎన్నికల్లో తిప్పికొడతారని'' అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios