Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు ఓట‌మి త‌ప్ప‌దు.. అధికారంలోకి వ‌చ్చేది బీజేపీనే.. : కిష‌న్ రెడ్డి

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుద‌లైంది. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ఈ సారి కామారెడ్డి, గ‌జ్వేల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. అయితే, కేసీఆర్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌నీ, రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. 
 

Telangana Assembly Elections 2023: KCR will lose and BJP will come to power, G Kishan Reddy RMA
Author
First Published Oct 10, 2023, 10:51 AM IST | Last Updated Oct 10, 2023, 10:51 AM IST

Union Minister G Kishan Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుద‌లైంది. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ఈ సారి కామారెడ్డి, గ‌జ్వేల్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్నారు. అయితే, కేసీఆర్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌నీ, రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి స్పందిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని అన్నారు. బీజేపీ గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసారి ఓటమి తప్పదని అన్నారు. "కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రం నుండి వెళ్లిపోతుంది. బీజేపీ అధికారంలోకి వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది. బీజేపీ మాత్రమే మార్పు తీసుకురాగలదని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, తెలంగాణను కాపాడేందుకు, కేసీఆర్‌ను గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం" అని మీడియా మాట్లాడుతూ కిష‌న్ రెడ్డి అన్నారు.

కాగా, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమ‌వారం ప్రకటించింది. నవంబర్ 7న మిజోరంలో ఒకే ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  నవంబర్ 7, 17న ఛత్తీస్‌గఢ్ లో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 23న రాజస్థాన్, 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీల‌కు చాలా కీలకంగా మారాయి. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌, బీజేపీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios