Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ పై గ‌జ్వేల్ లో పోటీకి దిగిన 'ఎల‌క్ష‌న్ కింగ్' !

Gajwel: డాక్టర్ కె.పద్మరాజన్ అలియాస్ 'ఎలక్షన్ కింగ్' 1988 నుంచి వివిధ ఎన్నికల్లో పలు స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేదు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీపై ఆయ‌న పోటీ చేశారు. 1991లో పీవీ నరసింహారావుపై  కూడా పోటీ చేశారు.
 

Telangana Assembly Elections 2023: 'Election King' Dr. K Padmarajan to contest against CM KCR in Gajwel  RMA
Author
First Published Nov 5, 2023, 3:13 AM IST

Election King Dr. K Padmarajan: ప‌లు ఎన్నికల్లో పోటీ చేసి 'ఎల‌క్ష‌న్ కింగ్' గా పేరు తెచ్చుకున్న కె పద్మరాజన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే తొలిరోజే శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని సేలంకు చెందిన పద్మరాజన్ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 236 ఎన్నికల్లో పోటీ చేశారు. గజ్వేల్‌లో ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ ఆయనకు 237వ నామినేషన్‌ కానుంది. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా మూడోసారి గజ్వేల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పద్మరాజన్ 5 రాష్ట్రపతి, 5 ఉపరాష్ట్రపతి, 32 లోక్‌సభ , 72 అసెంబ్లీ, 3 ఎమ్మెల్సీ, 1 మేయర్, 3 చైర్మన్, ఇంకా అనేక ఇతర ఎన్నికల్లో పోటీ చేశారు.

పద్మరాజన్ ఏబీ వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి వంటి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులపై పోటీ చేశారు. అయితే ఆయన తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిపై పోటీ చేయబోతున్నారు. వివిధ ఎన్నికల్లో పోటీ చేసి 'ఎన్నికల రారాజు'గా పేరు తెచ్చుకున్న కె పద్మరాజన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే తొలిరోజే శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని సేలంకు చెందిన పద్మరాజన్ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 236 ఎన్నికల్లో పోటీ చేశారు.

గజ్వేల్‌లో ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ ఆయనకు 237వ నామినేషన్‌ కానుంది . ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా మూడోసారి గజ్వేల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పద్మరాజన్ ఏబీ వాజ్‌పేయి, జయలలిత, కరుణానిధి వంటి పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులపై పోటీ చేశారు. అయితే ఆయన తొలిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిపై పోటీ చేయబోతున్నారు. డాక్టర్ కె.పద్మరాజన్ అలియాస్ 'ఎలక్షన్ కింగ్' 1988 నుంచి వివిధ ఎన్నికల్లో పలు స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటి వరకు మొత్తం 237 నామినేషన్లు దాఖలు చేశారు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీపై పద్మరాజన్ వయనాడ్ నుంచి, 1991లో పీవీ నరసింహారావుపై పోటీ చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆయనను ప్రపంచంలోనే అత్యంత విఫలమైన అభ్యర్థిగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios