Telangana Assembly Elections 2023: ప్రగతి భవన్ లో పార్టీ కార్యక్రమాలు.. ఈసీ నోటీసులు
Hyderabad: పార్టీ సంబంధిత కార్యక్రమాలను ప్రాంగణంలో నిర్వహించినందుకు ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 'బీ ఫారాలు' అందజేసినట్లు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై సమాచారంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
Telangana Assembly Elections 2023: పార్టీ సంబంధిత కార్యక్రమాలను ప్రాంగణంలో నిర్వహించినందుకు ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డి. రోనాల్డ్ రోస్ ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 'బీ ఫారాలు' అందజేసినట్లు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై సమాచారంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
వివరాల్లోకెళ్తే.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ముఖ్యమంత్రి అధికారిక క్యాంపు కార్యాలయంతో పాటు నివాసంగా ఉన్న ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 'బీ ఫారాలు' అందజేశారని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై సమాచారం కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రగతి భవన్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి.రొనాల్డ్ రోస్ ఈ నోటీసులు జారీ చేశారు.
ప్రగతి భవన్ లో పార్టీ అభ్యర్థులకు 'ఫారం బీ' జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రగతిభవన్ ప్రభుత్వ ఆస్తి అనీ, ఎన్నికల కోడ్ ప్రకారం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించరాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 16న ఈసీకి ఫిర్యాదు చేసింది.
అక్టోబర్ 15న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ప్రగతి భవన్ లో సీఎం నుంచి ఫారం బీ అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలను నిరంజన్ సమర్పించారు. ప్రగతి భవన్ అధికారులకు నోటీసులు జారీ చేయడంపై స్పందించేందుకు వికాస్ రాజ్, రోనాల్డ్ రోస్ నిరాకరించారు. కాగా, తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడికానున్నాయి. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.