Telangana Assembly Elections: ఎన్నిక‌ల కోసం స్పీడ్ పెంచిన బీజేపీ.. పార్టీ ఐక్య‌త‌, ప్ర‌చార వ్యూహాల‌పై దృష్టి

Hyderabad: తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమ‌వుతూ స్పీడ్ పెంచుతోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ నాయ‌కుల మ‌ధ్య‌ ఐక్యత, ఎన్నిక‌ల ప్రచార వ్యూహంపై దృష్టి సారించి.. దీని కోసం ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. తెలంగాణ బీజేపీలో పదవుల కోసం నెలల తరబడి అంతర్గత కుమ్ములాటలు, పదవుల కోసం తంటాలు పడిన తర్వాత శనివారం ఢిల్లీలో పార్టీ కోర్ టీం, రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి భేటీతో అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్న కొత్త సంకల్పంతో దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.
 

Telangana Assembly elections 2023: BJP Gears Up for Assembly Elections Focus on unity and propaganda strategies RMA

Telangana BJP Gears Up for Assembly Elections: తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమ‌వుతూ స్పీడ్ పెంచుతోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ నాయ‌కుల మ‌ధ్య‌ ఐక్యత, ఎన్నిక‌ల ప్రచార వ్యూహంపై దృష్టి సారించి.. దీని కోసం ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. తెలంగాణ బీజేపీలో పదవుల కోసం నెలల తరబడి అంతర్గత కుమ్ములాటలు, పదవుల కోసం తంటాలు పడిన తర్వాత శనివారం ఢిల్లీలో పార్టీ కోర్ టీం, రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి భేటీతో అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్న కొత్త సంకల్పంతో దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

ఈ ఏడాది చివ‌ర‌ల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌ర్వాత ఏడాది లోక్ స‌భ ఎన్నిక‌లు రానున్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ధాన పార్టీలైన భార‌త రాష్ట్ర మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ లు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే బీజేపీ ప‌క్కా గెలుపు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంద‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కు తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి బండి సంజ‌య్ ను త‌ప్పించిన త‌ర్వాత ఆ పార్టీలో కొంతవ‌ర‌కు దూకుడు త‌గ్గింద‌నే చెప్పాలి. ఇదే స‌మ‌యంలో తెలంగాణ బీజేపీలో పదవుల కోసం నెలల తరబడి అంతర్గత కుమ్ములాటలు, పదవుల కోసం తంటాలు పడిన తర్వాత శనివారం ఢిల్లీలో పార్టీ కోర్ టీం, రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి భేటీతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలన్న కొత్త సంకల్పంతో దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

రాష్ట్ర బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేకర్, అరవింద్ మీనన్ లతో సమావేశమై ప్రచార ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా హైలైట్ చేయాల్సిన అంశాలు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి అగ్రనేతలు ప్రసంగించాల్సిన బహిరంగ సభలతో సహా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎంపికను కుదించడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ తన తుది నిర్ణయాలను తీసుకోవడం, అభ్యర్థులను ప్రకటించడంలో కొంత జాప్యం జరగవచ్చు.

కొందరు నేతల అంతర్గత కుమ్ములాటల కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన బీజేపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న విశ్వాస లోటును ఎలా అధిగమించగలదు, ప్రతి ఒక్కరినీ లైన్లోకి తీసుకుని పార్టీ విజయానికి ఎలా కృషి చేయాలనే అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారనే సందేశాన్ని ఎంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలమని నేతలు చర్చించారు. ఉద్యోగ‌ నియామక పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం, పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో వైఫల్యం వంటి  బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థతను బహిర్గతం చేసే నిర్దిష్ట అంశాలపై కూడా ఈ ప్రచారం దృష్టి పెడుతుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios