వెయ్యికి పైగా ధరఖాస్తులు: టిక్కెట్ల కోసం జితేందర్ రెడ్డి, వికాస్ రావు అప్లికేషన్లు
బీజేపీ టిక్కెట్ల కోసం ఆశావాహులు ధరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా ధరఖాస్తులు అందాయి. పార్టీ కీలక నేతలు రేపు, ఎల్లుండి టిక్కెట్ల కోసం ధరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉంది.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు బీజేపీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటికే వెయ్యికిపైగా ధరఖాస్తులు అందాయి. ఈ నెల 4వ తేదీ నుండి ధరఖాస్తులను బీజేపీ ఆహ్వానిస్తుంది. ఈ నెల 10వ తేదీ వరకు టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీ. టిక్కెట్ల కోసం ధరఖాస్తు చేసుకొనే పద్దతిని బీజేపీ ఈ దఫా ప్రవేశ పెట్టింది. శుక్రవారంనాడు వేములవాడ అసెంబ్లీ నుండి టిక్కెట్టు కోసం మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు సీహెచ్ వికాస్ రావు ధరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడ ఇవాళ పార్టీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేశారు. రేపు, ఎల్లుండి బీజేపీ కీలక నేతలు పార్టీ టిక్కెట్ల కోసం ధరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదే బీజేపీ టిక్కెట్ల కోసం ధరఖాస్తుకు చివరి తేదీ. ధరఖాస్తుకు ఎలాంటీ ఫీజు లేదు. దీంతో పార్టీ టిక్కెట్ల కోసం భారీగా ధరఖాస్తులు అందాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం టిక్కెట్ల కోసం ధరఖాస్తుల కోసం ఫీజును నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది చివరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుండి వ్యూహం రచిస్తుంది. ఇప్పటికే సునీల్ భన్సల్ నేతృత్వంలో ఆ పార్టీ యంత్రాంగం వ్యూహలను రచిస్తుంది. ఎన్నికల కోసం సుమారు 20 కమిటీలను నియమించనుంది.ఇవాళ ఈ కమిటీల నియామకం కోసం ప్రకాష్ జవదేకర్, సునీల్ భన్సల్ లు రాష్ట్ర నేతలతో చర్చించారు. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తున్నారు.