Telangana Election 2023: ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..?
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో మహబుబ్ నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.
ఈ నేపధ్యంలో మహబుబ్ నగర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి మహబుబ్ నగర్ లో 14 స్థానాలు ఉండగా.. 12 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా.. గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.
Mahbubnagar Assembly Election Results: ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!
నెం. | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్ధి | పార్టీ |
1 | కొడంగల్ | రేవంత్ రెడ్డి | కాంగ్రెస్ |
2 | నారాయణపేట | పర్ణిక రెడ్డి చిట్టెం | కాంగ్రెస్ |
3 | మహబూబ్ నగర్ | వై .శ్రీనివాస్ రెడ్డి | కాంగ్రెస్ |
4 | జడ్చర్ల | అనిరుధ్ రెడ్డి |
కాంగ్రెస్ |
5 | దేవరకద్ర | జీ. మధుసుధన్ రెడ్డి | కాంగ్రెస్ |
6 | మక్తల్ | వారిటి శ్రీహరి రామ్మోహన్ | కాంగ్రెస్ |
7 | వనపర్తి | మేఘారెడ్డి | కాంగ్రెస్ |
8 | గద్వాల | కృష్ణమోహన్ రెడ్డి | బీఆర్ఎస్ |
9 | అలంపూర్ (ఎస్సీ) | విజయుడు | బీఆర్ఎస్ |
10 | నాగర్ కర్నూల్ | కే. రాజేశ్ రెడ్డి | కాంగ్రెస్ |
11 | అచ్చంపేట (ఎస్సీ) | సీహెచ్ వంశీకృష్ణ | కాంగ్రెస్ |
12 | కల్వకుర్తి | కసిరెడ్డి నారాయణ రెడ్డి | కాంగ్రెస్ |
13 | కొల్లాపూర్ | జూపల్లి కృష్ణారావు | కాంగ్రెస్ |
14 | షాద్ నగర్ | శంకరయ్య | కాంగ్రెస్ |