తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. 

తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్‌ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్‌ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ నేపధ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఉమ్మడి ఖమ్మంలో 10 స్థానాలు ఉండగా.. 8 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా.. గులాబీ పార్టీ(బీఆర్ఎస్), సిపిఐ లు చెరో ఒక్క స్థానానికి పరిమితమయ్యాయి.

Khammam Assembly Election Results: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!

నెం.నియోజకవర్గంగెలుపొందిన అభ్యర్ధిపార్టీ
1పినపాక (ఎస్టీ)పాయం వెంకటేశ్వర్లుకాంగ్రెస్ 
2ఇల్లందు (ఎస్టీ)కోరం కనకయ్యకాంగ్రెస్ 
3ఖమ్మంతుమ్మల నాగేశ్వర్ రావుకాంగ్రెస్ 
4పాలేరుపొంగులేటీ శ్రీనివాస్కాంగ్రెస్ 
5మధిర (ఎస్సీ)మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ 
6వైరా (ఎస్టీ) మాలోతు రాందాస్ కాంగ్రెస్ 
7సత్తుపల్లి (ఎస్సీ)మట్ట రాగమయికాంగ్రెస్
8కొత్తగూడెంకూనంనేని సాంబశివరావు సిపిఐ
9అశ్వరావుపేట (ఎస్టీ)జే ఆదినారాయణకాంగ్రెస్ 
10భద్రాచలం (ఎస్టీ)తెల్లం వెంకట్రావుబీఆర్ఎస్