Asianet News TeluguAsianet News Telugu

Shadnagar Election Result 2023 : షాద్ నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కె. శంకరయ్య గెలుపు

Shadnagar Election Result 2023 : 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అంజయ్య ఎల్లన్నమోని కాంగ్రెస్ పార్టీకి చెందిన చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఓటర్లు  ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి కె. శంకరయ్యను ఎన్నుకున్నారు. 

Telangana Assembly Election Results 2023 In  Shadnagar Constituency, BSP Candidate is Pasupula Prasant Kumar rsl
Author
First Published Dec 3, 2023, 10:42 AM IST

Shadnagar Election Result 2023 : షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి అంజయ్య యెల్గనమోని బరిలో ఉండగా, బీజేపీ నుంచి అందె బాబయ్య, కాంగ్రెస్ నుంచి కె. శంకరయ్య, బీఎస్ పీ నుంచి పసుపుల ప్రశాంత్ కుమార్ పోటీలో ఉన్నారు. కాగా ఈ నియోజక వర్గం ఫలితాలు వచ్చేశాయి. ఈ సారి షాద్ నగర్ నియోజక వర్గం ప్రజలు  బీఆర్ఎస్, బీజేపీలను కాదనుకుని కాంగ్రెస్ అభ్యర్థి కె. శంకరయ్యను ఎమ్మెల్యేగా గెలిపించారు. కె. శంకరయ్యకు మొత్తం 77, 817 ఓట్లు పడగా అందులో 7128 భారీ మెజార్టీతో గెలుపొందారు. 

అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి చెందిన అంజయ్య ఎల్లన్నమోని 20,425 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చౌలపల్లి ప్రతాప్ రెడ్డిపై విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ కు 43.43 శాతం ఓట్లు వచ్చాయి.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 2,25,470 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో1,13,872 మంది పురుషులు, 1,11,583 మంది మహిళలు ఉండగా.. 15 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios