Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో కొనసాగుతోన్న రాజీనామాల పర్వం.. మరీ నెక్ట్స్ ఎవరు?

Telangana Assembly Election: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయాయి. కానీ ఈ తరుణంలో అసమ్మతి నేతల తమ పార్టీని వీడడంతో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధానంగా  ఈ సమస్యను బీజేపీ ఎదుర్కొంటుంది. ఎన్నికల వేళ సభలు,సమావేశాలు అంటూ హడావుడి ఉండాల్సిన వేళ రోజుకో కీలక నాయకుడు పార్టీని వీడుతున్నారు. 

telangana assembly election  Party defections continue in BJP KRJ
Author
First Published Nov 2, 2023, 1:03 PM IST

Telangana Assembly Election: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. తమ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్య బిజెపి ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ బహిరంగ సభలు, సమావేశాలు అంటూ హడావుడి జరగాల్సిన తరుణంలో కమలంలో ఒక్కొక్క రెక్క ఊడిపోయినట్లు.  బిజెపిని ఒక్కొక్క నేత పార్టీని వీడుతున్నారు. 

ఈ పార్టీ ఫిరాయింపు పర్వంలో తొలుత మాజీ ఎమ్మెల్యే కొమటి రెడ్డి గోపాల్ రెడ్డి కమలానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా వివేక్ వెంకటస్వామి కూడా కొమటి రెడ్డి బాటలో నడిచారు. వివేక్ కూడా పార్టీని వీడి వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ షాక్ నుంచి తెరుకోకముందే.. గంటల వ్యవధిలోనే బిజెపి అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు.ఆయన తనకు సరైన గుర్తింపు లేదంటూ పార్టీకి గుడ్ బై చెప్పాడు. అయితే.. ఈ సమయంలో మరికొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ లిస్టులో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు విజయశాంతి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా చేవెళ్ల పార్లమెంట్ బరిలో దిగాలని చూస్తున్నారట. అయితే బిజెపి జనసేన పొత్తుల వ్యవహారంలో ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి- జనసేన పొత్తుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంగీకారం తెలిపినా.. శేర్ లింగంపల్లి, తాండూర్ సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ సిగ్మెంట్ లోని శేర్ లింగంపల్లి, తాండూర్ నియోజకవర్గాల్లో బిజెపికి పటిష్టమైన క్యాడర్ ఉందని, ఈ నియోజకవర్గాలలో పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బిజెపి అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా షేర్ లింగంపల్లి టికెట్ ను రవి కుమార్ యాదవ్ కి ఇవ్వాలని, పార్టీని గెలిపించుకునేందుకు లీడర్లు కార్యకర్తలు ప్రజల సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల లోని సీట్లను జనసేనకు కేటాయిస్తే..  ఎన్ని రోజులు పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడ్డా శ్రమ వృధా అవుతుందని వాపోయినట్లు తెలుస్తోంది. పరోక్షంగా ఆ రెండు స్థానాలను జనసేనకు కట్టబడితే తాను పార్టీ వీడుతోనని వార్నింగ్ కూడా ఇచ్చారంట. 

అంటిముట్టనట్లుగా రాములమ్మ

ఇకపోతే.. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అలియాస్ రాములమ్మ..ఆమె మాత్రం గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.  పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సీనియర్ నేతల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. ఆమె గతంలో బిజెపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ తరచూ విమర్శలను గుర్తిస్తూ ఉండేది. ఆ తరువాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమె పార్టీని వీడుతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ తాను పార్టీని మారబోనంటూ పలుమార్లు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా ఎన్నికల నేపథ్యంలో కూడా ఆమె సైలెంట్ గా ఉండడంతో ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios