Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election 2023 : మంత్రి గంగుల కారునూ వదిలిపెట్టని పోలీసులు (వీడియో)

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణలో పోలీస్ తనిఖీలు ముమ్మరం అయ్యారు.  ఇలా తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కారును కూడా వదిలిపెట్టకుండా తనిఖీ చేసారు పోలీసులు. 

Telangana Assembly Election 2023 ... Police searches in Minister Gangula Kamalakar Car AKP
Author
First Published Oct 16, 2023, 12:04 PM IST

కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. ప్రధాన పార్టీలన్నీ ప్రజల్లోకి వెళుతూ ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ధనం, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం పోలీసులను రంగంలోకి దింపింది. తెలంగాణకు పొరుగున వున్న రాష్ట్రాల బార్డర్ల వద్దే కాదు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసారు. సామాన్య ప్రజలనే కాదు రాజకీయ ప్రముఖుల వాహనాలను సైతం ఆపి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను సైతం పోలీసులు వదిలిపెట్టడం లేదు. ఇలా రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని తనిఖీ చేసారు. 

కరీంనగర్ నుండి సిరిసిల్లకు మంత్రి గంగులతో పాటు బిఆర్ఎస్ ఎంపీ కేశవరావు, మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ వెళుతుండగా మార్గమధ్యలో పోలీసులు ఆపారు. కొదురుపాక వద్ద వీరు వెళుతున్న కారును అడ్డుకుని తనిఖీలు చేపట్టారు. ఇందుకు బిఆర్ఎస్ నాయకులు సైతం సహకరించారు.

కారులోని బ్యాగులతో పాటు ఇతర వస్తువులను పోలీసులు తనిఖీ చేసారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, నగదు గానీ గంగుల కారులో లభించలేదు. దీంతో తనిఖీలు ముగిసిన తర్వాత నాయకులు సిరిసిల్లకు పయనమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios