Asianet News TeluguAsianet News Telugu

Telangana Budget 2024: రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్.. మరీ మెప్పిస్తుందా..? నొప్పిస్తుందా? 

Telangana Budget 2024:  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ సర్కార్  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్ లో ఉన్నా ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది

Telangana Assembly Budget Session 2024 KRJ
Author
First Published Feb 10, 2024, 8:37 AM IST | Last Updated Feb 10, 2024, 8:43 AM IST

Telangana Budget 2024: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.  2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. పార్లమెంటు ఎన్నికల సమీపిస్తున్న వేళ రేవంత్ సర్కార్  ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించి కేటాయింపులే బడ్జెట్ లో ఉన్నా ఏడాది మొత్తానికి అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. 

తొలుత శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ఆవరణలో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ అంశాలను చదివి వినిపిస్తారు.ఈ బడ్జెట్ పై సోమవారం నాడు అసెంబ్లీ, శాసన మండలిలో వేర్వేరుగా చర్చ జరుగనున్నది. 

అయితే..  ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.ఇందులో కొత్త ప్రాజెక్టులు, భారీ కేటాయింపులు లేకుండా కేవలం  ఏటా సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. ఇది రెండు నెలల నుంచి ఆరు నెలల వరకు ప్రభుత్వం ఖర్చు చేసే వివరాలు మాత్రమే ఇందులో పేర్కొనబడుతాయి. సార్వత్రిక ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో జూన్‌ లేదా జూలై నెలలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios