Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Budget session 2022 :దళిత బంధుకు రూ. 17,700 కోట్లు

 దళిత బంధు పథకం కింద  2022-23 బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,700 కోట్లను కేటాయించింది.  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు.
 

Telangana Assembly Budget session 2022:Government allots Rs. 17,700 crore to Dalitha Bandhu Scheme
Author
hyderabad, First Published Mar 7, 2022, 12:26 PM IST

హైదరాబాద్: Dalitha Bandhu  పథకానికి 2022-23  బడ్జెట్ లో రూ. 17,700 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao సోమవారం నాడు  Telangana Budget 2022  ను ప్రవేశ పెట్టారు. తెలంగాణ సీఎం KCR  2021 ఆగష్టు 16వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్దిదారులకు నేరుగా రూ. 10 లక్షలను ప్రభుత్వం అందిస్తుంది.   

 ఈ ఏడాది బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన  కేటాయింపులతో 11,800 కుటుంబాలకు  దళిత బంధు ద్వారా లబ్ది చేకూరనుందని ప్రభుత్వం ప్రకటించింది. 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా  ఈ పథకాన్ని దశలవారీగా  అమలు చేయనుంది. దళిత బంధు పథకం  అమలు కోసం సీఎం కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. 

మూడేళ్లలో రాష్ట్రంలో దళితుంలదరికీ కూడా ఈ పథకం కింద లబ్ది చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దళిత బంధు అందుకొన్న లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాలను కూడా అమలు చేయనున్నారు.  ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధును కూడా అమలు చేయనున్నారు.  అయితే తొలుత ప్రభుత్వ ఉద్యోగాలు లేని వారికి ఈ పథకం ద్వారా లబ్ది పొందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. చివరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేస్తారు.

ఈ ఆర్థిక సాయంతో పాటు, దళిత సెక్యూరిటీ ఫండ్‌ను కూడా ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేస్తోంది. ఈ ఫండ్‌కు జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తారు. ఈ ఫండ్‌క లబ్దిదారులకు ఇచ్చే మొత్తం నుంచి కనీస మొత్తాన్ని జమ చేస్తారు. ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన ఐడెంటీ కార్డును లబ్దిదారులకు జారీ చేస్తారు. దీంతో ఈ స్కీమ్‌ పురోగతిని ప్రభుత్వం మానిటర్ చేయడం కుదురుతుంది.

 ఈ పథకం ద్వారా అందిన నగదుతో తమకు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు ఈ పథకం కింద లబ్దిదారులు సమూహంగా ఏర్పడి బారీ స్థాయిలో కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవచ్చని కూడా తెలిపింది.దళిత బంధు పథకానికి బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios