తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రేపటి నుంచి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ కార్యాలయ సిబ్బందితో పాటు అసెంబ్లీ సిబ్బందిలో చాలా మంది కోవిడ్ బారినపడటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

సభ నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో స్పీకర్ పోచారం చర్చించారు. ఈ భేటీలో సభ వాయిదా వేస్తేనే మంచిదని పలువురు సూచించారు. దీంతో సభను రేపటి నుంచి వాయిదా వేయాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించారు.