Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల కోసమే రైతులకు క్షమాపణలు.. తెలంగాణపై ఇంత కర్కశంగానా: కేంద్రంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

పేదలు, రైతుల ప్రయోజనాల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం తీరు అత్యంత కర్కశంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వున్నాయి కాబట్టే రైతులకు క్షమాపణ చెప్పారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు

telangana agriculture minister niranjan reddy fires on center over paddy issue
Author
Hyderabad, First Published Dec 5, 2021, 4:36 PM IST

పేదలు, రైతుల ప్రయోజనాల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్ రెడ్డి (niranjan reddy). ఆదివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం తీరు అత్యంత కర్కశంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో (elections) ఎన్నికలు వున్నాయి కాబట్టే రైతులకు క్షమాపణ చెప్పారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

యాసంగిలో వరి బదులు రైతులు ఖచ్చితంగా ఇతర పంటలే వేయాలని ఆయన తేల్చి చెప్పారు. ఇతర పంటలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతులకు అందుబాటులో వుంచామని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత నిరసన తెలియజేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఆయన ధ్వజమెత్తారు. పార్లమెంట్ సాక్షిగా రైతుల్ని, దేశాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (piyush) తప్పుదోవ పట్టించారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 

Also Read:వడ్ల కొనుగోళ్లలో చివరికి ముద్దాయిగా మారిన టీఆర్ఎస్..?

కాగా.. ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలియజేస్తున్నా.. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఇదే అంశంపై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్‌ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ వారితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

మరోవైపు  Paddy ధాన్యం కొనుగోలు విషయమై  కేంద్రం నుండి స్పష్టత వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని Trs ఎంపీలు శుక్రవారం ప్రకటించారు.  ఈ డిమాండ్ తో రాజ్యసభ నుండి  శుక్రవారం నాడు టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు K. Keshava rao, Nama nageswara raoలు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.Parliament సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి ఇప్పటి వరకు  వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి  స్పష్టత కోరినా కూడా  ఇంత వరకు ప్రభుత్వం నుండి  స్పష్టత ఇవ్వలేదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios