తెలంగాణ హైకోర్టు జడ్జి అభిషేక్ రెడ్డి బదిలీ: సీజేఐకి వినతిపత్రం సమర్పించిన న్యాయవాదులు

తెలంగాణ  హైకోర్టు  జడ్జి అభిషేక్ రెడ్డి  బదిలీ నిర్ణయాన్ని  వెనక్కి  తీసుకోవాలని న్యాయవాదులు  సీజేఐని  కోరారు.   ఇవాళ  సీజేఐని  న్యాయవాదులు కలిసి  వినతి పత్రం  సమర్పించారు. 

Telangana  Advocates  meeting  with  CJI  DY  Chandrachudu

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు  జడ్జి  అభిషేక్  రెడ్డిని పాట్నా హైకోర్టుకు  బదిలీ  చేయడాన్ని  వెనక్కి  తీసుకోవాలని  తెలంగాణ న్యాయవాదుల  బృందం  సోమవారంనాడు  సుప్రీంకోర్టు  చీఫ్  జస్టిస్  డివై చంద్రచూడ్ కు  వినతి పత్రం సమర్పించారు. ఇవాళ  సాయంత్రం నాలుగున్నర  గంటలకు  సీజేఐ  చంద్రచూడ్ ను  తెలంగాణ న్యాయవాదుల  బృందం  కలిసిన  ఈ  మేరకు  వినతి పత్రం సమర్పించింది. కొలిజీయం  సిఫారసు మేరకే  జడ్జి  అభిషేక్  రెడ్డిని  బదిలీ  చేసినట్టుగా  సీజేఐ  చంద్రచూడ్  తెలిపారు.  అయితే  న్యాయవాదులు  ఇచ్చిన  వినతిపత్రాన్ని  పరిశీలిస్తానని  న్యాయవాదులు  ప్రకటించారు. 

హైకోర్టు జడ్జి  అభిషేక్  రెడ్డి బదిలీని  నిరసిస్తూ  కొన్ని రోజులుగా  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  న్యాయవాదులు  ఆందోళనలు  నిర్వహిస్తున్నారు.  సీజేఐ  హామీ  ఇవ్వడంతో  న్యాయవాదులు ఆందోళనను  విరమించారు.  గతంలో  కూడ  బదిలీపై  వెళ్లిన  జ్జడిలను  తిరిగి  తెలంగాణ  హైకోర్టుకు  బదిలీ  చేయాలని కోరుతూ  ఆందోళన  నిర్వహించారు. ఈ ఆందోళనల  నేపథ్యంలో  జడ్జిల  బదిలీలను  వెనక్కి తీసుకొంది  ఉన్నత  న్యాయస్థానం. అయితే  బీహర్  హైకోర్టుకు  జస్టిస్  అభిషేక్  రెడ్డి  బదిలీ  చేయడాన్ని  నిరసిస్తూ  న్యాయవాదులు  ఆందోళనలు  నిర్వహించారు. జస్టిస్  అభిషేక్  రెడ్డి  బదిలీపై ఉన్నత  న్యాయస్థానం  ఎలాంటి నిర్ణయం  తీసుకొంటుందో  త్వరలోనే  తేలనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios