కొండగట్టులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి జనసేన పండగ చేసుకుంటున్న  పార్టీ అధినేత వపన్ కల్యాణ్ కు  ప్రజా తెలంగాణ నేత పంజుగుల శ్రీశైల్ రెడ్డి పది ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ వచ్చినందుకు పది రోజులు తిండి మానేసిన పవన్  ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతారని ఆయన హెచ్చరించారు. శ్రీశైల్ రెడ్డి వేసిన పది ప్రశ్నలు ఇవే:

*మల్లన్నసాగర్ ఏడవుందో తెలుసా నీకు, అక్కడి   పోకుండ కొండగట్టుకు పోవుడు ఎందుకు?

*ప్రభుత్వ విధానాలు బాగున్నయ్ అన్నంక ఇంక ప్రజల్లోకి ఎందుకు, ప్రజల సమస్యలు తెలుసుకొనుడు ఎందుకు?

*తెలంగాణ వచ్చిందని 12 రోజులు అన్నం మానేసినోడివి తెలంగాణ ప్రజలకు ఏం చేస్తవు?

*సింగరేణి, వేములఘాట్, గోలివాడ, వట్టెం, గౌరారం అంటే ఏమిటో తెలుసా గురించి నీకు తెలుసా?  

*పరీక్షలు పెట్టిన సంవత్సరం అయినా టీఎస్పీఎస్సీ రిజల్ట్ ఇవ్వదు, ఎపుడయిన ఈ వూసెత్తావా?


*తెలంగాణ వచ్చినంకా ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వరు. అడిగినవా ఎపుడన్నా?

*ఫూలే అంబేడ్కర్ ఫోటోలు పెట్టుకున్నవు - నేరెళ్ళ ఇసుక లారీల కింద నలిగిన దళితుల గురించి ఎపుడయినా విన్నవా?

*అక్కడేమి జరుగుతున్నదో  నీ మిత్రుడు కేటీఆర్ కు అడగ గలవా?

*తెలంగాణా లో రైతులు, నిరుద్యోగులు ఆత్మ హత్య చేసుకుంటున్న విషయం తెలుసా? ఎందుకో ఎపుడయిన కనుక్కున్నవా?

 

*పవన్... నీకు కేసీఆర్, కేటీఆర్ తో యాక్సెస్ ఉంది కదా. పైవి అన్నీ తెలుసుకుని ఈ సమస్యల పరిష్కారం కోసం పాటుపడమని సలహా ఇవ్వగలవా?