ములుగు జిల్లాలో గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బాలుడితో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు.

ములుగు జిల్లాలో గోదావరి నదిలో స్నానానికి దిగిన ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బాలుడితో పాటు ఇద్దరు యువకులు ఉన్నారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగాది పండగను పురస్కరించుకుని గ్రామస్థులు, యువకులు గ్రామ దేవతను గోదావరి నది స్నానానికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో నదిలో స్నానానికి దిగిన బెడిక సతీశ్‌, సాయివర్ధన్‌, సందీప్‌లు గల్లంతు అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జాలర్లు గల్లంతైన ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సతీశ్‌, సాయివర్ధన్‌, సందీప్‌లు నీటిలో దిగి స్నానం చేస్తుండ‌గా ప్రవాహం అధికంగా ఉండడంతో గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదంలో గల్లంతైన విద్యార్థులలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.