బీజేపీ నేత హత్య కేసులో న్యాయస్థానం 15మందిని దోషులుగా నిర్థారించింది. దోషులందరికీ జవిత ఖైదు విధిస్తూ... న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ కి చెందిన బీజేపీ నేత ముచ్చర్ల అశోక్ రెడ్డి  హత్య కేసులో వరంగల్ న్యాయస్థానం  సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15మందిని దోషులగా నిర్థారించడంతోపాటు... వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. శిక్ష పడినవారిలో ముచ్చర్ల గ్రామ ప్రస్తుత  సర్పంచ్ రఘు కూడా ఉన్నారు. 

హాసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో  2013లో జరిగిన బీజేపీ నేత అశోక్ రెడ్డి హత్య జరిగింది. గ్రామంలో జరిగిన వివాదాల కారణంగా ఓ ముఠా అశోక్ రెడ్డిపై దాడి చేసి మరీ హత్య చేసింది.  ఈ కేసులో దోషులకు  జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తిరుమల దేవి తీర్పునిచ్చారు.

శిక్ష పడిన దోషులు కొండపాక బిక్షపతి అలియాస్ రఘు( ప్రస్తుత సర్పంచి) బండారి గణేష్, గౌరు భార్గవన్ రెడ్డి, సిలువేరు అశోక్, బండారి గణేష్, కుక్కమూడి జయరాజ్, దమేరా రాజ్ కుమార్, మెరుగు రాజు, రావుల కరుణాకర్, దున్నపోతుల శ్రీకాంత్, గుంటి రాజేంద్ర ప్రసాద్, గౌరు యాదగిరి రెడ్డి, పోరెడ్డి సామిరెడ్డి, బొడ్డుకూరి సమ్మయ్య, దమేరా యాదగిరి, బండారి సాంబయ్య