Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రేపు పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. షబ్ ఎ మెరాజ్ సందర్భంగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ సెలవు ఇచ్చింది.
Shab e meraj: తెలంగాణలో రేపు పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రేపు సెలవు అని తెలిపింది. రేపు ముస్లింలకు పవిత్రమైన షబ్ ఎ మెరాజ్ పండుగ. ఈ పండుగ సందర్భంగానే ఫిబ్రవరి 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులనూ జారీ చేసింది.
షబ్ ఎ మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రి జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ముస్లింలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంపై ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YS Sharmila: నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వడం లేదు.. చెడు జరగాలనేనా?: జగన్ పై షర్మిల పరోక్ష వ్యాఖ్యలు
తొలుత రేపు సెలవు ప్రకటనపై గందరగోళం నెలకొంది. కొందరు సెలవు ఉన్నదని, మరికొందరు లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఇంకా ఉత్తర్వులు తమకు అందలేదని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. రేపు ఐచ్ఛిక సెలవా? పబ్లిక్ హాలీడేనా? అనేది కొంతసేపు తేలలేదు.