కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. కొద్దిమంది మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ.. పెళ్లి తంతులు నిర్వహిస్తున్నారు. తాజాగా.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా శుభకార్యం జరిగింది.

రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కుమారుడు నితీష్‌ వివాహం బుధవారం రాత్రి నిరాడంబరంగా జరిగింది. దివంగత పి.రామేశ్వర్‌రెడ్డి, మంజుల కుమార్తె వైష్ణవితో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఈ వివాహం జరిగింది. కోవిడ్‌ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ, షేక్‌పేట్‌ తహసీల్దార్‌ అనుమతితో జరిగిన ఈ వేడుకకు వధువరూల కుటుంబీకులతో పాటు అతి కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు అయ్యారు. వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులూ మాస్క్‌లు ధరించి, వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.