ప్రజాపాలన కోసం నోడల్ అధికారుల నియామకం .. ఏయే జిల్లాలకు ఎవరంటే..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమానికి నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

telagnana govt appointed nodal officers for praja palana ksp

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమానికి నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నోడల్ అధికారులు వీరే :

  • ఆదిలాబాద్‌- ఎం. ప్రశాంత్‌
  • కరీంనగర్ – శ్రీదేవసేన
  • నిజామాబాద్‌- క్రిస్టినా చోంగ్తూ
  • వరంగల్‌ – వాకాటి కరుణ
  • మెదక్‌ – ఎస్‌. సంగీత
  • హైదరాబాద్‌ – కె.నిర్మల
  • రంగారెడ్డి – ఇ.శ్రీధర్‌
  • మహబూబ్‌నగర్‌ – టి.కె.శ్రీదేవి
  • నల్గొండ – ఆర్వీ కర్ణన్‌
  • ఖమ్మం – ఎం.రఘునందన్‌రావు

కాగా.. ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వొచ్చని సీఎం చెప్పారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా వుంది అనేది ప్రజావాణి చూస్తేనే అర్ధమవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ప్రజావాణిలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని .. ప్రజలు హైదరాబాద్‌కు రాకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దరఖాస్తుతో వివరాలు అందుతాయని ఎన్ని రోజుల్లో దానిని పరిష్కారం చేయగలుగుతామో తెలుస్తుందని.. ప్రతి మండలంలో రెండు గ్రూపులు వుంటాయని, ఒక గ్రూప్‌కి ఎండీవో, మరో గ్రూప్‌కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరి కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన అవసరం లేదని , ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని సీఎం పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios