Asianet News TeluguAsianet News Telugu

బ్యూటీషియన్ శిరీష కేసులో సీన్ లోకి మళ్లీ తేజస్విని

బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా  ఈ కేసులో రాజీవ్ ప్రియురాలిగా ఉన్న తేజస్విని మళ్లీ సీన్ లోకి వచ్చింది. ఆమెను బంజారాహిల్స్ పోలీసులు మరోసారి విచారించారు. ఆమెను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తీసుకురాకుండా రహస్య ప్రదేశంలో ఆమెను విచారించి 2 పేజీల సమాచారాన్ని సేకరించారు.

tejaswini interrogated second time in beautician mysterious death case

శిరీష ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్య చేశారంటూ శిరీష కుటుంబసభ్యులు బలంగా వాదిస్తున్నారు. వారు అనేక అనుమానాలను వెల్లడిస్తున్నారు. ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి తేజస్విని ని ఎందుకు పక్కకు తప్పించారని వారు పదేపదే ప్రశ్నిస్తున్నారు. శిరీష రాజీవ్ ప్రియురాలు కావడంతో ఆమెను కూడా ఈ కేసులో మరోసారి విచారించాలని పోలీసులను డిమాండ్ చేస్తూ వచ్చారు శిరీష బంధువులు.

 

దీంతో తాజాగా తేజస్వినిని పోలీసులు విచారణ జరిపారు. ఆమెను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్  కు తరలించకుండా రహస్య ప్రదేశంలో విచారణ చేపట్టారు. ఆమె నుంచి కీలకమైన సమాచారం సేకరించారు. అయితే పోలీసులకు అందిన సమాచారంలో తేజస్విని వెల్లడించిన వివరాల ప్రకారం శిరీషతో తాను పలుమార్లు ఫోనులో కూడా గొడవ పెట్టుకున్న విషయాన్ని వెల్లడించారు.

 

రాజీవ్ ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తాను బెంగుళూరు నుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకుని వచ్చానని వివరించారు. దీంతోపాటు శిరీష కారణంగానే రాజీవ్ పెళ్లి విషయంలో ఆలస్యం చేశాడని ఆమె పోలీసులకు వివరించినట్లు తెలిసింది. శిరీష చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకోవడం తనను బాధించిందన్న విషయాన్ని కూడా పోలీసులకు తెలిపిందంటున్నారు.

 

ఇక రెండోరోజు కూడా పోలీసులు రాజీవ్, శ్రావన్ లను విచారిస్తున్నారు. ఇటు శిరీష మృతి కేసులో, అటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణం కేసులో ఇప్పటి వరకు రాజీవ్, శ్రావణ్ లు వెల్లడించిన సమాచారం ఆధారంగానే పోలీసులు విచారణ చేపడుతూ వస్తున్నారు. అయితే తాజాగా తేజస్విని ని కూడా మరోమారు పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ జరిపిన తీరు చూస్తే శిరీష మరణంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్న పరిస్థితి నెలకొంది.

 

దీనికితోడు నిందితులను పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ శిరీష బంధువులు బలంగా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు నిందితులను కాపాడాల్సిన అవసరం ఏమొచ్చిందని  వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై డిసిపి వెంకటేశ్వరావు స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణ వేగవంతం చేశామని, నిందితులు రాజీవ్, శ్రవణ్ లతో పాటు పలువురిని ప్రశ్నించామని డీసీపీ తెలిపారు.
 

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్ కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. ఆమె బంధువులు మీడియా ముందు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన, తమకు ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం గానీ, అవసరం గానీ లేవని అన్నారు. శిరీష పంపిన వాట్స్ యాప్ లొలేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios