రాజీవ్ విలాసాల కోసం చేసిన పొరపాట్లే రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయని పోలీసులు అంటున్నారు. ఈకేసులో తేజస్విని జీవితం నరకప్రాయమైంది. ప్రేమ గుడ్డిది అన్నట్లు గుడ్డిగా రాజీవ్ ను నమ్మడమే తనకు నష్టం చేకూర్చిందని తేజస్విని చెబుతోంది. అయితే రాజీవ్, తేజస్విని ప్రేమ వ్యవహారంలో అడ్డుగోడగా నిలిచిన శిరీష విషయాన్ని రాజీవ్ తల్లికి చెప్పేందుకు ఒకసారి రాజీవ్ ఇంటికి వెళ్లింది తేజస్విని అప్పుడేం జరిగిందంటే?

 

ఆ సమయంలో రాజీవ్ తల్లి తేజస్విని పట్ల చాలా అమర్యాదగా, అవమానపరిచేవిధంగా మాట్లాడినట్లు తేజస్విని కొంతమంది మీడియా ప్రతినిధుల వద్ద కంటతడి పెట్టుకుని చెప్పింది. రాజీవ్ ను మరచిపోయి నీ పని నువ్వు చేసుకో. అయినా నువ్వు చాలా పొట్టిగా ఉన్నవు. నీ కులం వేరు, మా కులం వేరు. మా కులంలో రాజీవ్ కు అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. నీదారి నువ్వు చూసుకో అని అవమానకరంగా మాట్లాడినట్లు తేజస్విని వెల్లడించింది.

 

ఒకవైపు శిరీష ఆమె మిత్రుల నుంచి వేధింపులు మరోవైపు శిరీష గురించి చెప్పాలనుకుంటే రాజీవ్ తల్లి తనను అవమానించడంతో తను తీవ్ర మానసిక వేధనకు గురైనట్లు చెబుతోంది తేజస్విని. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ విషయాన్ని రాజీవ్ కు చెబితే వాళ్ల కుటుంబంలో కలతలు వస్తాయని చాలా రోజుల వరకు చెప్పలేదని అంటున్నది తేజస్విని. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే శిరీష ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత ఎస్సై ప్రభాకర్ రెడ్డి కాల్చుకుని చనిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయని చెబుతోంది తేజస్విని.

 

మొత్తానికి ఇటు శిరీషను వాడుకుని వదిలించుకునే ప్రయత్నంలో తర్వాత తేజస్విని ని కూడా రాజీవ్ వాడుకున్నాడని తేజస్విని చెబుతున్న మాటలు బట్టి తెలుస్తోంది. ఇక రాజీవ్ విచ్చలవిడితనం కారణంగానే ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబం కూడా రోడ్డున పడిందని బాధితుల తాలూకు జనాలు అంటున్నారు.