ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న భార్య మమత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆమె మెయిల్ చేశారు.  

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న భార్య మమత బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మల్లన్నను విడుదల చేయించాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఆమె మెయిల్ చేశారు. 

కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై తీన్మార్ మల్లన్న సునిశిత విమర్శలు గుప్పిస్తారు. ఇటీవలనే ఓ కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ (bail) దొరికింది. అయితే మరో కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. 

గతంలో అరెస్టైన కేసులో బెయిల్ పై విడుదల అవుతారని మల్లన్న అనుచరులు భావించారు. కానీ మరో కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయన జైలు నుండి విడుదల కావడం కష్టంగా మారింది. ఓ క‌ల్లు వ్యాపారి ఫిర్యాదుతో పెట్టిన కేసులో మల్ల‌న్న‌ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో మ‌ల్ల‌న్న ఏ-5గా ఉన్నారు. నిజామాబాద్ (nizambad) పోలీసులు మల్లన్నను అరెస్ట్ చేశారని సమాచారం.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చారు. మల్లన్న ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నాలుగేళ్లుగా క్షేత్రస్థాయిలో కృషి చేశారు. దాని ప్రభావం ఎన్నికల్లో కన్పించింది.