హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ యువతి నగ్నంగా చిందులేసి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆ యువతి మద్యం మత్తులో ఉండడం వల్లే అలా చేసిందని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఓ యువతి నగ్నంగా చిందులేసి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆ యువతి మద్యం మత్తులో ఉండడం వల్లే అలా చేసిందని పోలీసులు అంటున్నారు. వివరాల్లోకి వెడితే..
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి ఓ యువతి మద్యం మత్తులో హంగామా చేసింది. రహ్మత్ నగర్ పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలోని పార్కు వద్ద నగ్నంగా చిందులేసింది. గమనించిన అవుట్ పోస్ట్ మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెకు దుస్తులు వేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే వాటిని సైతం యువతి చింపేసింది. దీంతో పోలీసులు మరోసారి ఆమెకు దుస్తులు అందించారు. కూకట్ పల్లికి చెందిన ప్రియుడు భరత్ తనను మోసం చేశాడని యువతి వాపోయింది.
దీంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్ చేసింది. ఆ తరువాతే ఇలా చేసిందని పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు ఆ తరువాత ఆమెను ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 21, 2021, 3:18 PM IST