వికారాబాద్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం రోడ్డుపై అక్కాచెల్లెళ్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కను దుండగులు అపహరించుకుపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువతి ఆచూకిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.