ఆమెకు పెళ్లై.. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే... ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మాత్రం సదరు మహిళ కూతురిపై కన్నేశాడు. ఆ మహిళ లేని సమయంలో.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ఓ వివాహితకు.. 17ఏళ్ల కుమార్తె ఉంది. కాగా.. సదరు మహిళ అదే ప్రాంతానికి ఓ వ్యాపారి(50) తో అక్రమ సంబంధం పెట్టుకుంది.అయితే.. ఆ వ్యాపారి మాత్రం వివాహిత కుమార్తె పై కన్నేశాడు.  కాగా... ఇటీవల సదరు మహిళ తన సోదరితో కలిసి బయటకు వెళ్లింది. ఈ సమయాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నాడు ఆ వ్యాపారి.

వివాహిత లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి... మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం. ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తె ద్వారా నిజం తెలుసుకున్న వివాహిత.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.