ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. 

రేపు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీ20 మ్యాచ్ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య వారిని హోటల్‌కి తరలించారు. క్రికెటర్స్‌ను చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తడంతో శంషాబాద్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. 

ALso REad:నాగ్‌పూర్‌లో హిట్‌మ్యాన్ విధ్వంసం.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సజీవం

ఇకపోతే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో.. టీమిండియా తొలి విజయం అందుకుంది. తొలి మ్యాచ్ ని ఆస్ట్రేలియా గెలుచుకోగా... రెండో మ్యాచ్ టీమిండియా గెలిచి సమం చేసింది. నాగ్‌పూర్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ముగిసిన రెండో మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. భారత జట్టు సారథి రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) నాగ్‌పూర్‌లో వీరవిహారం చేసి సిరీస్ లో భారత్ ఆశలను సజీవంగా ఉంచాడు. రోహిత్ దూకుడుకు ఆసీస్ నిలిపిన లక్ష్యం 7.2 ఓవర్లలోనే ఆవిరైపోయింది.