Asianet News TeluguAsianet News Telugu

317 జీవో రద్దుకై టీచర్ల ఆందోళనలు: నాడు సెక్రటేరియట్, నేడు ప్రగతి భవన్ ముట్టడి యత్నం

317 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన సాగింది. దశలవారీగా ఉపాధ్యాయులు ప్రగతి భవన్ వద్దకు చేరుకొన్నారు. ఆందోళన కోసం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Teachers protest near pragathi bhavan against 317 g.o.
Author
Hyderabad, First Published Jan 15, 2022, 4:47 PM IST

హైదరాబాద్: 317 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నాడు pragathi bhavan ను ముట్టడించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను police అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రగతి భవన్ ముట్టడికి ఉపాధ్యాయులు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. పంజాగుట్ట, బేగంపేట వైపు నుండి ప్రగతిభవన్ వరకు భారీగా పోలీసులు మోహరించారు. పండుగ రోజున తమ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.

Teachers సంఘాలు దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడికి వస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. వచ్చిన వారిని వచ్చినట్టుగానే పోలీసులు అరెస్ట్ చేశారు.

317 జీవో రద్దు చేసి స్థానికతను ఆధారంగా బదిలీ చేపట్టాలని మహిళా ఉపాధ్యాయురాలు డిమాండ్ చేశారు. 317 జీవో ప్రకారంగా సీనియర్లు, జూనియర్ల సీనియారిటీలో తీవ్ర వ్యత్యాసం వస్తోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.  317 జీవో ప్రకారంగా బదిలీలతో  తాము  తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ జీవోను రద్దు చేయాలని ఆందోళన బాట పట్టారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో చలో సెక్రటేరియట్  ను ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించాయి.

Telangana ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 317 జీవో పై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్లుగా విభజించారు. టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. గతంలో జిల్లాల విభజనకు పూర్వం టీచర్ ఉద్యోగాలను సర్కార్ భర్తీ చేసింది. తెలంగాణలో Trs సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రస్తుతం ఆ ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఒకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాల్లోకి వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది. దీంతో సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సీనియర్ టీచర్లకు పట్టణ ప్రాంతాలకు ఎంపిక చేసుకొంటున్నారు. అయితే జూనియర్ టీచర్లు ఆయా జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలను ఎంచుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొంటున్నాయి. అంతేకాదు సుమారు 25 వేల మంది టీచర్లు తమ స్థానికతను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఉపాధ్యాయసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  తమ ప్రాంతం కాకపోయినా.. కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని జూనియర్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా ఏర్పడిన ఖాళీల ఆధారంగానే భర్తీ చేస్తూ ఉంటారు. దీంతో ఆ మారుమూల ప్రాంతాల్లో ఇప్పట్లో ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదని నిరుద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల కేటాయింపునకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం హేతుబద్ధంగా లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. వీరికి Bjp, Congress, లెఫ్ట్ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios