Asianet News TeluguAsianet News Telugu

తొమ్మిదో తరగతి విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన..కానీ, పోలీసులు ఏం చేశారంటే...

పాఠాలు చెప్పాల్సిన టీచరే విద్యార్థిని పాలిట కీచకుడిగా మారాడు. లైంగిక వేధింపులకు గురిచేశాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. 

Teacher misbehavior with ninth class girl in sangareddy
Author
First Published Oct 25, 2022, 12:30 PM IST

సంగారెడ్డి : విద్యార్థినికి పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. ఈ ఘటన జిల్లాలోని కరుణ పాఠశాలలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి (14)ని నిక్సన్ అనే ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేశాడు. రోజురోజుకూ వేధింపులు ఎక్కువవడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. తనపట్ల నిక్సన్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు మోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా కేసు విసయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. 

ఇదిలా ఉండగా, విద్యార్థులకు ఇంస్టాగ్రామ్ లో అశ్లీల వీడియోలను పంపించిన  మధుసూదన్ ఆచార్య అని ప్రొఫెసర్ను నగరంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ యూనివర్సిటీ ఉద్యోగం నుంచి తొలగించింది. సదరు ప్రొఫెసర్ పోర్న్ వీడియోలను విద్యార్థులకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న కాలేజీ పాలకమండలి ఆయనను ఇంటికి పంపించింది. గౌరవమైన పదవిలో ఉంటూ విద్యార్థులకు అసభ్యకరమైన పోస్టులు చేయడం తలవంపులు తెచ్చేదిగా పేర్కొంది.

ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం:హైద్రాబాద్‌లో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే తమిళనాడులో మార్చి 17న వెలుగులోకి వచ్చింది. పాఠాలు భోదిస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రొఫెసర్ పాడుబుద్ధితో తన దగ్గర చదువుకునే విద్యార్థినిపై కన్నేశాడు. తన కోరిక తీర్చాలని బాలికను హింసించేవాడు. చివరికి విద్యార్థిని ఆ వేధింపులు తట్టుకోలేక ప్రొఫెసర్ పై కళాశాల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఉదాంతం తమిళనాడులో చోటు చేసుకుంది.

కాగా, హైదరాబాద్ లో అక్టోబర్ 19న దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ గా పనిచేస్తున్న వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. స్కూలుకు వచ్చే ఆ చిన్నారిని గత రెండు నెలలుగా డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కాగా, తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడం తల్లిదండ్రులు గమనించారు. తీవ్ర మనస్థాపానికి గురైన చిన్నారి ప్రతీ చిన్న దానికి ఏడవడం మొదలుపెట్టింది. డిప్రెషన్ లోకి వెళ్లింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని సోమవారం ప్రశ్నించారు. అలా విషయం వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో 4 ఏళ్ల బాలికపై ప్రిన్సిపాల్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాలిక లోయర్ కిండర్ గార్టెన్ విద్యార్థిని. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ రజనీకుమార్ గత రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు రావడంతో ప్రశ్నించిన తల్లిదండ్రులు బాలిక తెలిపిన విషయాన్ని విని షాక్ అయ్యారు. వెంటనే పోలీసులను సంప్రదించారు. 

డ్రైవర్ డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి వస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని, చాలా మంది పిల్లలు అతనికి భయపడుతున్నారని పోలీసులు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి తల్లి మీడియాతో మాట్లాడుతూ... “నా కూతురు డిప్రెషన్‌లో ఉంది. ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఆమె మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడింది. దీనికి కారణమైన నిందితుడిని బహిరంగంగా నగ్నంగా కొట్టాలి. ప్రిన్సిపాల్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios