తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ క్యాడర్ కు సూచించారు. పొత్తులపై మరి కొంత సమయం వేచి ఉండాలని కోరారు. 

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహం తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలని ఆ పార్టీ అధినేత క్యాడర్ కు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ క్యాడర్ తో మంగళవారం ఆయన సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగువారి సంక్షేమం, అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందన్నారు.

దళిత విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారం.. నెలల తరబడి అఘాయిత్యం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగువారందరికీ గర్వకారణమని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నాయకులు దేశానికి, రాష్ట్రానికి దారి చూపారని కొనియాడారు. కాగా.. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ విషయాన్ని ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదు. రాష్ట్రంలో భవిష్యత్ ప్రణాళికల గురించి కొందరు నేతలు ఆయనను ప్రశ్నించగా..‘మరికొంత కాలం ఆగండి’ అని చెప్పారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది.