తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం.. ఏపీలో వ‌చ్చేది మా ప్ర‌భుత్వ‌మే.. : చంద్రబాబు

Hyderabad : తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, ఎయిర్ పోర్టు, మెట్రో, జీనోమ్ వ్యాలీ చూస్తే టీడీపీ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 
 

TDP will get its former glory in Telangana: TDP national President Nara Chandarbabu Naidu RMA

TDP national President Nara Chandarbabu Naidu: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, ఎయిర్ పోర్టు, మెట్రో, జీనోమ్ వ్యాలీ చూస్తే టీడీపీ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ, పార్టీకి పూర్వ వైభవం వస్తుందనడంలో తనకు ఎటువంటి సందేహం లేదని అన్నారు. తెలంగాణలో టీడీపీని మరోసారి ప్రధాన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ భారీ ప్రగతిని సాధించి నేడు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందంటే దానికి కారణం టీడీపీ వేసిన పునాది అని పేర్కొన్నారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, ఎయిర్ పోర్టు, మెట్రో, జీనోమ్ వ్యాలీ చూస్తే టీడీపీ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మెరుగైందనీ, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అభివృద్ధిని ఆపలేదని, విధ్వంసానికి పాల్పడలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో విధ్వంసం జరిగిందనీ, అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌య‌మ‌నీ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల రాజమండ్రిలో జరిగిన పార్టీ వార్షిక సమావేశంలో టీడీపీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. జూన్ 3న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ మ‌ధ్య నేపథ్యంలో చంద్రబాబు పర్యటన, తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీలు తమ కూటమిని పునరుద్ధరించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో అమిత్ షాతో టీడీపీ అధ్యక్షుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో 2023 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వచ్చే ఏడాది లోక్ స‌భ‌ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే,  ఈ రెండు ఎన్నికల తర్వాత తెలుగునాట టీడీపీ అత్యంత శక్తిమంతమైన పార్టీగా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చంద్ర‌బాబు అన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై 2018లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప‌లు పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా.. వైపాకా విజ‌యాన్ని అడ్డుకోలేక పోయింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేతిలో అధికారాన్ని కోల్పోయింది. ఘోర పరాజయం తర్వాత బీజేపీ పట్ల తన వైఖరిని మెత్తబడ్డ చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios