Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి..?

చంద్రబాబుపై అలిగిన మోత్కుపల్లి.. కారు ఎక్కేందుకు సిద్ధం..?

tdp senior leader motkupally may join in TRS

సీనియర్‌ టీడీపీ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారా...? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. జూన్ రెండో వారంలో ఆయన సైకిల్ ని వదిలి.. కారు ఎక్కే అవకాశంఉందనే ప్రచారం ఊపందుకుంది.  చంద్రబాబు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మనస్థాపం చెందే.. మోత్కుపల్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని  గత మార్చి 18న మోత్కుపల్లి వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. పార్టీలో సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి లేకుండానే హైదరాబాద్‌లో చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీని తెలంగాణలో బతికించుకోవడానికి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆ తర్వాత మోత్కుపల్లి మీడియాకు వివరించారు. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మోత్కుపల్లి ఇక పార్టీ మారడంపై సీరియస్‌గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. 

అలాగే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లికి గవర్నర్‌ పదవీ వస్తుందంటూ గడిచిన మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. పదవీ రాకపోవడంతోపాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లిలో బాగా పెరిగిపోయిందని టాక్. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా  మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లిని మినీ మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే  ఆయన దూరంగా ఉన్నారని సమాచారం.

అంతేకాకుండా.. ఇటీవల మోత్కుపల్లి టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. మోత్కుపల్లి పార్టీ మారడం ఖాయమనే అనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios