టిఆర్ఎస్ లో చేరిన టిడిపి రమణ ముఖ్య అనుచరుడు

Tdp ramana follower joins in trs presence of ktr and kavitha
Highlights

టిడిపికి మరో షాక్

టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్.రమణ ముఖ్య అనుచరుడుగా ముద్ర పడ్డ వ్యక్తి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత సమక్షంలో జగిత్యాల నియోజక వర్గం టిడిపి ఇంచార్జి బోగ వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ లో చేరారు. వెంకటేశ్వర్లు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ కు ముఖ్య అనుచరుడు.

శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన  కార్యక్రమంలో వెంకటేశ్వర్లు తో పాటు ఒడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు మొగిలి, జగిత్యాల పద్మశాలి సంఘం సీనియర్ నాయకులు బూస గంగారాం, మానపూర్ శ్రీహరి, పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు చీని సురేందర్, వైశ్య, వర్తక సంఘం నాయకుడు చకిలం కిషన్, జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బోగ ప్రవీణ్ వారి అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మంత్రి కెటిఆర్ గులాబి కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంాణ అభివృద్ధికి పడుతున్న తపన, కృషిని చూసి యితర పార్టీల నేతలు టిఆర్ఎస్ లో చేరడం మంచి పరిణామం అన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తో పాటు ఇతర నాయకులకు ఎంపి కవిత శుభాకాంక్షలు తెలిపారు. సమన్వయంతో పనిచేస్తూ జగిత్యాల నియోజక వర్గం అభివృద్ధి చేస్తూ,  పార్టీ ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ విజన్ ను చూసి టిఆర్ఎస్ లో చేరానన్నారు బొగ వెంకటేశ్వర్లు. జగిత్యాల ను సుందర వనంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన, కార్యాచరణ లో తాము కూడా భాగస్వాములం అవుతామని చెప్పారు. ఎంపి కవిత చూపిన బాటలో నడుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల టిఆర్ఎస్ ఇంఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, జగిత్యాల టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.

loader