తెలంగాణ సిఎం కేసిఆర్ మాయమాటలతో కాలమెల్లదీస్తున్నారని విమర్శించారు టిడిపి తెలంగాణ అధినేత ఎల్. రమణ. బోడుప్పల్ లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 5లక్షల బడ్జెట్ ఖర్చు చేసినా తెలంగాణలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని రమణ విమర్శించారు. కేసిఆర్ కుటుంబానికే తెలంగాణ వచ్చిన తర్వాత లాభం జరిగింది తప్ప జనాలకు ఒరిగిందేమీ లేదన్నారు. అప్పుల్లో జపాన్, సింగపూర్ తో పోటీ పడతామని మాట్లాడడం దౌర్భాగ్యమన్నారు. ఇంకా రమణ ఏమన్నారో వీడియోలో చూడండి.