బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్నంత సేపు  టిడిపి సభ్యుల నిరసన 

సభనుంచి తమను సస్పెన్షన్ చేసినందుకు నిరసనగా అసెంబ్లీ మెయిన్ గేట్ ముందు నిలబడి టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి ,చ సండ్ర వెంకట వీరయ్య నేడు నిరసన తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సభలో ఆర్థిక మంత్రి ఈటెల్ రాజేందర్ బడ్జెట్ పాఠం చదివుతున్నంత సేపు ఈ నిరసన కొనసాగింది. 

బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తున్న పుడు అంతరాయం కల్గించినందుకు రేవంత్ రెడ్డిని, అనుచరుడు సండ్రవీరయ్యను సభనుంచి ఈ సమావేశాల కాలమంతా సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్నపుడు రేవంత్ రన్నింగ్ కామెంటరీ చేస్తూ అవమానించారనేది ఆయన మోపిన అభియోగమయితే, సండ్రను ఎందుకు చేశారో తెలియడంలేదు. తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదుని, నిజానికి తాను గవర్నర్ ప్రసంగ పాఠం చదువుతూ ఉన్నానని సండ్ర అంటున్నారు.