మహానాడులో కొత్త వాతావరణం

అదేంటి కేసిఆర్ కు టిడిపి రమణ క్షమాపణ చెప్పడమేంటి అనుకుంటున్నారా? నిత్యం కేసిఆర్ ను వదలకుండా విమర్శలు గుప్పించే రమణ ఉన్నఫలంగా క్షమాపణలు చెప్పడమేంటి అని ఆరా తీస్తున్నారా? అవును మీరు చదివింది నిజమే. టిడిపి తెలంగాణ అధ్యక్షులు రమణ కేసిఆర్ కు క్షమాపణ చెప్పారు. వివరాల కోసం చదవండి.

తెలంగాణ టిడిపి మహానాడు గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ మహానాడులో కేసిఆర్ కు వ్యతిరేకంగా కళాకారులు బూతులు తిడుతూ పాటలు పాడారు. దీంతో ఆ పాటలను ఆపేయాలని రమణ ఆదేశించారు. వ్యక్తిగతంగా కించపరిచేలా పాటలు పాడడం సంస్కారం కాదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వ్యవస్థ శిక్షిస్తుందని రమణ పేర్కొన్నారు. కళాకారులు ఇలాంటి అనుచితమైన బూతు పదాలు వాడడం సరికాదని రమణ వారిని మందలించారు.

అంతేకాదు ఈ తరహా పాటలు మహానాడులో చోటు చేసుకున్నందున రమణ క్షమించాలంటూ వేడుకున్నారు. ఇక రమణ తర్వాత కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని వీడిపోయారని విమర్శించారు. దేశంలో సచివాలయానికే రాని సిఎం ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క కేసిఆరే అని విమర్శించారు. కేసిఆర్ పాలనలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతుందని విమర్శించారు.

స్వార్థం కోసం కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడారని విమర్శించారు. చంద్రబాబు అండతో మళ్లీ తెలంగాణలో చరిత్ర తిరగరాస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని రమణ విమర్శించారు. కేసీఆర్ పాలనలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతుందని ఆయన ఆరోపించారు.