కౌంటర్: పోసానిని హైద్రాబాద్‌లో తిరగనివ్వం: టిడిపి

TDP leader MN Srinivas reacts on Posani Krishna Murali comments
Highlights

పోసానిపై టిడిపి కౌంటర్


హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించిన  సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టిడిపి గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. పోసాని కృష్ణ మురళిని హైద్రాబాద్ లో  తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు.

 వైసీపీ, బీజేపీ ఏజెంట్‌ మాదిరిగా పోసాని మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.  దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ హితవు పలికారు. సోమవారంనాడు  పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్‌ను అడ్డుకోవటానికి గ్రేటర్ టీడీపీ కార్యకర్తలు ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. అప్పటికే పోసాని ప్రెస్‌మీట్‌ ముగించుకుని వెళ్లిపోయారు.
 
సీఎం చంద్రబాబుపై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన విమర్శలు చేశారు.  23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అక్రమంగా తనవైపు తిప్పుకున్నారని  ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. 

loader