Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ అభివృద్దిలో అదే గేమ్ చేంజర్... నాకెంతో సంతృప్తి: న్యూడిల్లీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

అజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం కోసం దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ క్రమంలో సైబరాబాద్ అభివృద్దిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

TDP  Chief Chandrababu Naidu on IT Development in Cyberabad
Author
Hyderabad, First Published Aug 7, 2022, 8:50 AM IST

న్యూడిల్లీ : రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం... కానీ మనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలకు మేలు చేసేలా మన పనులుండాలని రాజకీయ పార్టీలకు టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇలా గతంలో వాజ్ పేయి ప్రధానిగా వుండగా చేసిన పనులు, తాను ఉమ్మడి ఆంధ్రప్రవదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన పనులు అటు దేశం, ఇటు రాష్ట్ర స్థితిగతులనే మార్చేసాయని పేర్కొన్నారు. ఆనాటి తమ ఆలోచన పలితమే నేడు దేశంలో అద్భుత రహదారులు, తెలుగురాష్ట్రాల్లో ఐటీ అభివృద్ది అని చంద్రబాబు పేర్కొన్నారు. 

శనివారం జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో పాల్గొనేందుకు టిడిపి చీఫ్ దేశ రాజధాని న్యూడిల్లీకి వెళ్ళారు. చాలాకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే డిల్లీలో జాతీయ మీడియాతో చంద్రబాబు కాస్సేపు ముచ్చటిస్తూ గతంలో వాజ్ పేయి హయాంలో జరిగిన అభివృద్దిలో తన పాత్రను గుర్తుచేసుకున్నారు. 

ప్రభుత్వాలు డబ్బులు ఖర్చుపెడితేనే అభివృద్ది జరుగుతందనుకుంటే పొరపాటే... మంచి విధానాలను రూపొందించినా అభివృద్ది సాధ్యమని చంద్రబాబు అన్నారు. ఇందుకు గతంలో దేశంలో వాయ్ పేయి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణ చతుర్భుజి కారణంగానే నేడు దేశంలో జాతీయ రహదారులు ఇంత అద్భుతంగా వున్నాయన్నారు. ఇక ఉమ్మడి  రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా వుండగా తీసుకువచ్చిన ఐటీ విధానం ఐటీ రంగంలో గేమ్ చేంజర్ గా మారిందని చంద్రబాబు పేర్కొన్నారు. 

read more  ప్రధాని మోదీ సమావేశానికి చంద్రబాబు.. దూరంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్ ,కేసీఆర్..

ప్రపంచంలో అప్పుడప్పుడే ఐటీ అభివృద్ది చెందడం చూసి దానికి భవిష్యత్ లో మంచి భవిష్యత్ వుందని గుర్తించినట్లు... అందుకే ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ కు ఐటీ ని తీసుకువచ్చానని చంద్రబాబు అన్నారు. అప్పుడు తీసుకువచ్చిన ఐటీ విధానం... ఆ తర్వాత సైబరాబాద్ నిర్మాణం రాష్ట్ర ఐటీరంగ రూపురేఖలనే మార్చేసాయని పేర్కొన్నారు. సైబరాబాద్ అభివృద్ది తర్వాత తెలుగువారు ఐటీ రంగంలో మంచి ప్రావిణ్యం సాధించారని... ఇప్పుడు వారు దేశవిదేశాల్లో మంచి స్థాయిలో వున్నారన్నారు. ప్రపంచ ఐటీ రంగంలో తెలుగవారి వాటా 30శాతానికి పైగానే వుందన్నారు.

మనం ప్రవేశపెట్టిన విధానాలతో తరతరాలకు మేలు జరగడం చూస్తుంటే చాలా సంతృప్తిగా వుంటుంది. అలాంటి సంతృప్తి సైబరాబాద్ ను చూసినప్పుడల్లా తనకు కలుగుతుందని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములను పక్కనబెట్టి మన పనులతో తరతరాలకు మేలు జరిగేలా చూడాలని ప్రభుత్వాలకు చంద్రబాబు హితవు పలికారు. 

ప్రస్తుతం ఏపీలో వైసిపి ప్రభుత్వ పాలనపైనా చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఏపీ అన్నిరంగాల్లోనూ గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోందని... ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని అన్నారు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయే తప్ప అభివృద్ది మాత్రం జరగడం లేదన్నారు. సీఎం జగన్ తన రాజకీయ అవసరాల కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసాడని చంద్రబాబు మండిపడ్డారు. 

రాజధాని లేకుండా అప్పుడే ఏర్పడిన రాష్ట్రాన్ని గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంతో కష్టపడి అభివృద్ది దిశగా నడిపామని చంద్రబాబు అన్నారు. 2029 వరకు అన్నిరంగాల్లో దేశంలోనే ఏపీని ప్రథమస్థానంలో నిలిపేలా తాను పునాదులు వేసానని... కానీ జగన్ చేతిలోకి అధికారం వెళ్లాక పరిస్థితి మారిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్దిని జగన్ నాశనం చేసాడని చంద్రబాబు మండిపడ్డారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios