ట్యాంక్ బండ్ పై ట్రైప్ స్కల్ప్చర్ ఏర్పాటు

ట్యాంక్ బండ్ కు వచ్చామంటే ప్రతి విగ్రహం ముందు విగ్రహంలా నిలబడి ఫొటోలకు ఫోజిలివ్వాల్సిందే.. ముక్కు మూసుకొని మరీ హుస్సేన్ సాగర్ అందాలను మన ఫోన్ లో బంధించాల్సిందే.

సెల్ఫీ క్లిక్ లతో మారుమోగే ఈ ప్రాంతంలో మరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తయారైంది.

ముంబై లో మాదరిగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ‘లవ్‌ హైదరాబాద్‌’ ట్రైప్‌ స్కల్ప్చర్‌ను ఏర్పాటు చేశారు. స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫౌండేషన్‌, కృష్ణకృతి, ఆర్ట్‌ ఎట్‌ తెలంగాణల సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు.

జీహెచ్‌ఎసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌లతో కలిసి కేటీఆర్‌ శుక్రవారం సెల్ఫీ దిగి దీన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంతో ఇక్కడి ప్రజలకున్న అనుబంధాల వ్యక్తీకరణకు ‘లవ్‌ హైదరాబాద్‌’ ప్రతీకగా నిలుస్తుందని, సెల్ఫీలకు వేదికగా మారబోతుందని అన్నారు.