Asianet News TeluguAsianet News Telugu

ఈడీ నోటీసులు: న్యాయ నిపుణులతో చర్చిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి

ఈడీ ఇచ్చిన నోటీసులపై ఏం చేయాలనే దానిపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.  

Tandur  MLA Pilot Rohith Reddy discusses on Enforcement Directorate notice
Author
First Published Dec 16, 2022, 5:36 PM IST

హైదరాబాద్: ఈడీ ఇచ్చిన నోటీసులపై   ఏం చేయాలనే దానిపై  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన న్యాయవాదితో  చర్చిస్తున్నారు.   శుక్రవారంనాడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి  ఈడీ అదికారులు  నోటీసులు జారీ చేశారు.హైద్రాబాద్‌లోని  మణికొండలో  ఉన్న  పైలెట్ రోహిత్ రెడ్డి కి ఈడీ అధికారులు  నోటీసులు ఇచ్చేందుకు  వచ్చారు. అయితే ఆ సమయంలో రోహిత్ రెడ్డి  అక్కడ లేరు. దీంతో రోహిత్ రెడ్డి  పీఏకు ఈడీ అధికారులు  సమాచారం ఇచ్చారు. మణికొండ  నివాసంలో  రోహిత్ రెడ్డి డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఈ నోటీసులను మణికొండలో ఉన్న ఎమ్మెల్యే సిబ్బందికి ఈడీ అధికారులు అందించారు.  ఈడీ నోటీసులపై  ఏం చేయాలనే దానిపై  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  చర్చించారు. ఈ నెల  19వ తేదీన విచారణకు రావాలని  ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై  రోహిత్ రెడ్డి  చర్చిస్తున్నారు. ఈ నోటీసులో ఈడీ అధికారులు ఏం ప్రస్తావించారు, దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే విషయమై  న్యాయవాదితో  రోహిత్ రెడ్డి  చర్చిస్తున్నారు. 

also read:తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు: ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశం

తన కుటుంబ సభ్యులు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఈడీ అదికారులు అడిగినట్టుగా  రోహిత్ రెడ్డి చెబుతున్నారు.  బెంగుళూరు, హైద్రాబాద్ డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  ఇటీవల ప్రకటించారు.  ఈ వ్యాఖ్యలు చేసిన  రోజుల వ్యవధిలోనే  పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడం చర్చకు దారి తీసింది.మొయినాబాద్ ఫాం హౌస్ లో తమ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ  హస్తం ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది.  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios